మల్కాజ్ గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔹గత ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీ తో గెలిచిండు. 🔹రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి ఎంతో ఇచ్చింది. పీసీసీ, సీఎం పదవులు రావటానికి మల్కాజ్ గిరి ప్రజలే కారణం. 🔹అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు ఏమి చేసిండు. 🔹పార్లమెంట్ లో పత్తా లేకుండా పోయిండు. ప్రజలకు కష్టం వస్తే కనబడకుండా పోయిండు. 🔹ఈ వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు. 🔹మీకు 24 గంటలు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండి. 🔹పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన...వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన 🔹బడే భాయ్ మోడీ మనకు బడా మోసం చేసిండు. 🔹చోట భాయ్ రేవంత్ రెడ్డి మనల్ని ఇక్కడ మోసం చేసిండు. 🔹వంద రోజుల్లో అందరికీ అన్ని చేస్తా అంటూ చోటా భాయ్ మోసం చేసిండు. 🔹గద్దెనెక్కంగా వెంబడే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 🔹రుణమాఫీ అయ్యిందా? తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చినయా? 🔹పైన పెద్ద మోసగాడు...కింద చిన్న మోసగాడు. 🔹అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించిండు. 🔹ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు మోసం పార్ట్ -2 సినిమా చూపిస్తున్నాడు. 🔹ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తా అంటున్నాడు. 🔹ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం పోతే మోసపోయిన వారిదే తప్పు. 🔹ఇప్పుడు ప్రజలంతా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. 🔹హైదరాబాద్ లో ప్రజలంతా బీఆర్ఎస్ కు పట్టం గట్టారు. 🔹గత పదేళ్లలో హైదరాబాద్ కు, తెలంగాణకు బీజేపీ ఏం చేసింది. 🔹ఉప్పల్, అంబర్ పేట్ లో పదేళ్లలో రెండు ఫ్లై ఓవర్లు కూడా కట్టలేకపోతున్నారు. 🔹మేము 36 ఫ్లై ఓవర్ లు కడితే రెండు కూడా కట్ట చేతకాని బీజేపీకి ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉందా? 🔹మోడీ వచ్చిన నాడు రూ. 400 సిలిండర్. ఇప్పుడు రూ. 1100. 🔹మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్. 🔹ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు. 🔹మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది. 🔹పప్పు, ఉప్పు, చింతపండు, బస్సు, రైలు అన్ని ధరలు పెంచిండు. 🔹అందుకే మోడీని ప్రజలందరూ ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని అని అంటున్నారు. 🔹కేసీఆర్ లేడు రాష్ట్రం ఆగమైందని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. 🔹కేసీఆర్ నిన్న మొత్తం అనుమానాలకు సమాధానాలను వివరంగా చెప్పిండు. రేవంత్ బక్వాస్ ప్రచారాలను తిప్పి కొట్టిండు. 🔹మీరు 10 స్థానాలు ఇస్తే మళ్లీ రాష్ట్రంలో కేసీఆరే రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తది. 🔹మోడీ 400 సీట్లు అని బిల్డప్ ఇస్తున్నాడు. వాళ్లు పోటీ చేసేదే 420 సీట్లు 🔹మోడీ గెలవడని అర్థమైంది కనుకనే ముస్లింల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 🔹ఎన్డీఏ కూటమికి 200 దాటావు, ఇండియా కూటమి కి కూడా 150 సీట్లు దాటావు. 🔹అందుకే బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్లె మనల్ని బతిమిలాడే పరిస్థితి వస్తది. 🔹బడే భాయ్ మోడీకి మేలు చేసేందుకు చోటే భాయ్ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి లో కాంగ్రెస్ నుంచి డమ్మీ అభ్యర్థి ని పెట్టిండు. 🔹రాష్ట్రంలో చాలా చోట్ల మోడీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. 🔹రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడు. 🔹రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు. 🔹రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా మోడీ కోసం పనిచేస్తుండా ? 🔹బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ కే ఉంది. 🔹2014, 2019 లో కూడా బీజేపీని అడ్డుకున్నది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. 🔹ఈటల, బండి సంజయ్, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించిందెవరు. 🔹బీజేపీ లీడర్లు అందరిని ఓడించింది బీఆర్ఎస్ మాత్రమే. 🔹బీజేపీని ఓడించే దమ్ము లేని కాంగ్రెస్ కు ఓటు వేసి వృథా చేయొద్దు 🔹కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అని ప్రచారం చేస్తున్నారు. 🔹నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే కేసీఆర్ కూతురు జైల్లో ఉండేదా? 🔹తప్పుడు ప్రచారాలను మైనార్టీలు నమ్మవద్దు. 🔹బీజేపీ ని ఓడించే దమ్ము లేకనే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నాడు. 🔹మరోసారి కాంగ్రెస్ కు ఓటు వేస్తే మొత్తం పథకాలను రేవంత్ రెడ్డి బంద్ పెడతడు. 🔹ఏమీ చేయకపోయినా సరే ఓట్లు వేశారంటూ అన్ని పథకాలను ఆపేస్తడు. 🔹కాంగ్రెస్ చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలె.
@BRSparty @LaxmaRagidi @chmallareddyMLA @kp_vivekanand మీరు ఓటేయకపోతే 420 హామీల మోసగాళ్లే రాజ్యమేలుతారు. అందుకే ఓటేయండి.. బీఆర్ఎస్ ఎం.పి. అభ్యర్ధులను గెలిపించండి. #ParliamentaryElection2024 #VoteForCar ✊
@BRSparty @LaxmaRagidi @chmallareddyMLA @kp_vivekanand This capture is 🫶🏻